ఉక్రెయిన్పై దాడి ఆపండి… రష్యాకు అంతర్జాతీయ కోర్టు ఆదేశం
హేగ్: ఉక్రెయిన్పై దాడిని నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) రష్యాను ఆదేశించింది. రష్యా దురాక్రమణపై ఉక్రెయిన్ చేసిన ఫిర్యాదుపై నెదర్లాండ్స్ హేగ్లోని ప్రపంచ కోర్టు ఈ మేరకు బుధవారం పిలుపునిచ్చింది. కాగా, ఐసీజే ఆదేశంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో రష్యాపై తాము వేసిన కేసులో ఉక్రెయిన్ పూర్తి విజయాన్ని సాధించిందని తెలిపారు. దురాక్రమణను వెంటనే నిలిపివేయాలని ఐసీజే ఆదేశించిందని చెప్పారు. అంతర్జాతీయ చట్టానికి లోబడి ఈ ఆదేశం ఉందన్నారు. రష్యా వెంటనే దీనికి కట్టుబడాలని సూచించారు. ఒకవేళ ఐసీజే ఆదేశాన్ని రష్యా విస్మరిస్తే ఆ దేశం మరింత ఏకాకి అవుతుందని హెచ్చరించారు.
మరోవైపు రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుతున్న చర్చల్లో కొంత పురోగతి కనిపించినట్లు తెలుస్తున్నది. యుద్ధాన్ని ముగించడానికి ఇరు దేశాలు తాత్కాలిక శాంతి ప్రణాళికను రూపొందించాయని ది కైవ్ ఇండిపెండెంట్ అనే వార్తా సంస్థ తెలిపింది. నాటోలో సభ్యత్వాన్ని ఉక్రెయిన్ కోరకపోతే, స్విడన్ తరహాలో సైనిక దళాలపై పరిమితులకు ఆ దేశం అంగీకరిస్తే కాల్పులను విరమించడంతోపాటు ఉక్రెయిన్ నుంచి రష్యా దళాలను వెనక్కి మళ్లించడం వంటి ఒప్పందాలు ఈ శాంతి ప్రణాళికలో ఉన్నట్లు పేర్కొంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thummala Nageshwara Rao | యాసంగిలో వరి వేయొద్దు.. రైతులకు తుమ్మల నాగేశ్వరరావు సూచన
JNTU | మహబూబాబాద్ జేఎన్టీయూలో అక్రమాలు.. హాస్టల్ డిపాజిట్ పర్సనల్ ఖాతాలోకి!
సాగునీటి వెతలు.. కరెంటు కోతలు.. కరువు కోరలు.. పంట చేతికొచ్చేనా..?
Kodangal | సీఎం ఇలాకాలో బలవంతపు భూ సేకరణ.. మనస్తాపంతో రైతు ఆత్మహత్యాయత్నం
Insurance Scam | శవాల మీది పేలాల మేత.. కార్మిక శాఖలో 150 కోట్ల స్కామ్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

