ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన అంజు ( Anju) పాకిస్థాన్ ప్రియుడు నస్రుల్లాతో కలిసి సోమవారం ఆ దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకున్నది. ప్రియుడితోపాటు పలువురితో కలిసి కేక్ కూడా కట్ చేసింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజస్థాన్‌లోని భివాడి జిల్లాకు చెందిన 34 ఏండ్ల అంజుకు భర్త, ఇద్దరు పిల్లలున్నారు. పాకిస్థాన్‌కు చెందిన 29 ఏండ్ల నస్రుల్లాతో ఫేస్బుక్ ద్వారా ఆమెకు పరిచయమైంది. ఈ నేపథ్యంలో జూలై 21న స్నేహితురాలిని కలిసేందుకు జైపూర్ వెళ్తున్నట్టు భర్తకు చెప్పింది. అలాగే తన సోదరిని కలిసేందుకు గోవా వెళ్తున్నట్టు పని చేసే సంస్థకు తెలిపింది.
కాగా, అంజు తొలుత ఢిల్లీ చేరుకున్నది. అక్కడి నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు ప్రయాణించింది. వాఘా సరిహద్దు మీదుగా పాకిస్థాన్‌లోకి ప్రవేశించింది. అక్కడ అంజును కలుసుకున్న ప్రియుడు నస్రుల్లా ఆమెను ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని తన గ్రామానికి తీసుకెళ్లాడు.
Anju With Pak Husband
మరోవైపు తాను లాహోర్ చేరుకున్నానని, కొన్ని రోజుల తర్వాత తిరిగి వస్తానని రాజస్థాన్‌లోని భర్తకు అంజు మెసేజ్ పంపింది. అయితే పాక్ వీసా ద్వారా జూలైలో ఆ దేశానికి చేరుకున్న ఆమె నాటి నుంచి ప్రియుడి ఇంట్లోనే ఉంటున్నది. కాగా, నస్రుల్లాను అంజు వివాహం చేసుకుని ఇస్లాం మతంలోకి మారినట్టు తెలుస్తున్నది. అలాగే ఆమె తన పేరును ఫాతిమాగా మార్చుకున్నట్టు సమాచారం.
కాగా, తాను తాను దేశద్రోహిని కాదని అంజు తెలిపింది. త్వరలోనే నస్రుల్లాతో కలిసి భారతదేశానికి తిరిగి వస్తానని తెలిపింది. తన గురించి మీడియా అనవసర రాద్ధాంతం చేస్తున్నదని ఒక వీడియోలో ఆరోపించింది. అయితే పాకిస్థాన్ జారీ చేసిన 30 రోజుల వీసా గడువు ఆగస్ట్ 20తో ముగియనున్నది. ఈ నేపథ్యంలో అంజు త్వరలో భారత్‌కు తిరిగి రావచ్చని తెలుస్తున్నది.
*अपने फेसबुक फ्रेंड नसरुल्लाह से शादी करने के लिए पाकिस्तान के खैबर पख्तूनख्वा प्रांत पहुंची अंजू शनिवार को वहां आजादी के जश्न में शामिल हुई. अंजू ने यहां नसरुल्लाह के साथ मिलकर पाकिस्तान की यौम-ए-आजादी (स्वतंत्रता दिवस) का केक भी काटा#Anju #Pakistan pic.twitter.com/HC7w8vHvOL
— Shakti Ojha🇮🇳 (@imShaktiojha) August 12, 2023
Anju said "I am NOT a '#gaddar'. Media distortions are causing needless chaos.
I definitely visit India along with Nasrullah after few month.#Gadar2 #Anju #Anjunasrullah #Seemasachin pic.twitter.com/AJQInMDn7o— Dileep kumar khatri🦚 (@DileepKumarPak) August 13, 2023