వాషింగ్టన్ : భారతీయ లారీ డ్రైవర్లు కాలిఫోర్నియా మోటర్ వాహనాల శాఖపై న్యాయ పోరాటం ప్రారంభించారు. కాలిఫోర్నియాలోని ఇమిగ్రెంట్ డ్రైవర్లకు ఇచ్చిన 20,000కుపైగా కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్‌లను హఠాత్తుగా రద్దు చేయడాన్ని కోర్టులో సవాల్ చేశారు. ఈ దావాను సిక్కు కొయలిషన్, ఆసియన్ లా కాకస్, లా ఫర్మ్ వెయిల్, గొట్షల్ అండ్ మంజెస్ ఎల్ఎల్పీ దాఖలు చేశాయి.
లైసెన్స్‌లకు సంబంధించిన అత్యంత స్వల్పమైన పరిపాలనాపరమైన సమస్యలను పరిష్కరించుకునేందుకు డ్రైవర్లకు అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. ఫలితంగా డ్రైవర్లు తమ ఉద్యోగాలు, జీవనోపాధిని కోల్పోయారని పిటిషనర్లు తెలిపారు.