టొరంటో, జనవరి 25 : భారత మూలాలున్న ఒక యువకుడిని కెనడాలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. బ్రిటిష్ కొలంబియాలోని బర్నబీలో ఈ ఘటన జరిగింది. బీసీ ముఠా సంఘర్షణే ఈ కాల్పులకు కారణమై ఉండవచ్చునని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నెల 22న సాయంత్రం 5.30 గంటలకు బర్నబీలోని కెనడావే 3700 బ్లాక్‌లో 28 ఏండ్ల దిల్‌రాజ్ సింగ్ గిల్‌పై కొందరు కాల్చి చంపారు.
టెహ్రాన్, జనవరి 25: ఇరాన్ నిరసనకారులపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయని, నిరసనల్లో 36,500 మంది ప్రాణాలు కోల్పోయారని తాజా నివేదిక వెల్లడించింది. ఇందులో అత్యధిక మరణాలు ఈ నెల 8, 9 తేదీల్లో చోటుచేసుకున్నాయని, ప్రభుత్వ రహస్య సమాచారం, ఇతర ఆధారాల ప్రకారం ఈ గణాంకాల్ని వెల్లడిస్తున్నట్టు ‘ఇరాన్ ఇంటర్నేషనల్ బోర్డ్’ పేర్కొన్నది. మరోవైపు అమెరికా దాడుల భయాల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ బంకర్లోకి వెళ్లినట్టు తెలిసింది.