గురువారం 29 అక్టోబర్ 2020
International - Oct 17, 2020 , 07:48:34

ప‌సి‌కం‌దును కిటి‌కీ‌లోంచి బయ‌టకు విసి‌రిన తల్లి

ప‌సి‌కం‌దును కిటి‌కీ‌లోంచి బయ‌టకు విసి‌రిన తల్లి

వాషిం‌గ్టన్‌: అమె‌రి‌కాలో భారత సంతతి మహిళ సబిత డోక్రాం తనకు పుట్టిన బిడ్డను కిటికీ నుంచి బయ‌టికి విసి‌రే‌సింది. ప్రస్తుతం ఆ పసి బాలుడు చావు‌బ‌తు‌కుల మధ్య కొట్టు‌మి‌ట్టా‌డు‌తు‌న్నాడు. న్యూయా‌ర్క్‌లో నివ‌సి‌స్తున్న సబిత ఈ నెల 10న స్నానా‌నికి బాత్‌‌రూ‌మ్‌కు వెళ్లారు. అక్కడే బాబుకు జన్మ‌ని‌చ్చారు. దీంతో ఒక్క‌సా‌రిగా భయా‌నికి గురైన ఆమె బాలు‌డిని కిటి‌కీ‌లోంచి బయ‌టికి విసి‌రే‌సింది. స్నానం చేసి వెళ్లి నిద్ర‌పో‌యింది. బాలుడి ఏడుపు విన్న స్థాని‌కులు పసి‌కం‌దును దవా‌ఖా‌నకు తర‌లిం‌చారు. ఆ బాలు‌డికి వెంటి‌లే‌ట‌ర్‌పై ఉంచి చికిత్స అంది‌స్తు‌న్నారు. పోలీ‌సులు సబి‌తాపై హత్యా‌యత్నం కేసును నమో‌దు‌చే‌శారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo