Video Viral | అమెరికాలో కాల్పుల మోతకు మరో భారతీయుడు బలయ్యాడు. పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌లో మోటెల్ వ్యాపారి రాకేశ్ ఎహగబన్ (51)ను ఓ వ్యక్తి పాయింట్‌బ్లాంక్ రేంజ్లో తలపై గన్‌తో కాల్చాడు. ఈ ఘటనలో రాకేశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ నెల 3వ తేదీ శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రాకేశ్ ఎహగబన్ పిట్స్‌బర్గ్‌లోని రాబిన్సన్ టౌన్షిప్లో మోటెల్ నడిపిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం తన మోటెల్ బయట గొడవ జరుగుతుండటంతో దాన్ని ఆపేందుకు రాకేశ్ బయటకు వెళ్లాడు. ఎందుకు గొడవ పడుతున్నారని అడగడంతో నిందితుడిని తన దగ్గర ఉన్న గన్‌తో పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు మోటెల్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
Sensitive content
అమెరికాలో పాయింట్ బ్లాంక్‌లో భారతీయుడిని కాల్చి చంపిన దుండగుడు
పిట్స్‌బర్గ్‌లో వ్యాపారి రాకేశ్ పటేల్(50)ను పాయింట్ బ్లాంక్‌లో గన్‌తో తలపై కాల్చిన స్టేన్లీ వెస్ట్ అనే వ్యక్తి
ఈ నెల 3న ఘటన.. అమెరికాలోని ఓ హోటల్లో పార్ట్నర్గా ఉన్న సూరత్‌కు చెందిన రాకేశ్… pic.twitter.com/M2dhOyQ5BF
— Telugu Scribe (@TeluguScribe) October 7, 2025
రాకేశ్‌పై కాల్పులు జరిపిన వ్యక్తిని స్టాన్లీ యుజెన్ వెస్ట్(37)గా పోలీసులు గుర్తించారు. రాకేశ్ తర్వాతే అక్కడే ఉన్న మరో యువతిపైనా నిందితుడు కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ నిందితుడు గత రెండు వారాలుగా రాకేశ్ నిర్వహిస్తున్న మోటెల్లోనే అద్దెకు ఉన్నాడని.. కాల్పుల అనంతరం అక్కడి నుంచి పరాయ్యాడని పేర్కొన్నారు. పిట్సబర్గ్లోని ఈస్ట్ హిల్స్‌లో నిందితుడిని గుర్తించారు. అతడిని పట్టుకునే క్రమంలో పోలీసులపైనా కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితం అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి పోలె చంద్రశేఖర్‌ను కాల్చి చంపిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.