PM Leo Varadkar | లండన్, మార్చి 20: ఐరిష్ ప్రధానమంత్రి, భారత సంతతికి చెందిన లియో వరాద్కర్ ప్రధాని పదవికి అలాగే తన పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు బుధవారం ప్రకటించారు. వారసుడిని ఎన్నకోగానే ప్రధాని పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. వ్యక్తిగత, రాజకీయ కారణాలతోనే వైదొలుగుతున్నట్టు పేర్కొన్నారు.
45 ఏండ్ల వరద్కర్ 2017- 2020 మధ్య, మళ్లీ డిసెంబర్ 2022 నుంచి ఐర్లాండ్ ప్రధానిగా కొనసాగుతున్నారు. ఐర్లాండ్‌కు అతి చిన్న వయసులో ఎన్నికైన ప్రధానిగా లియో గుర్తింపు పొందారు. అలాగే ఐర్లాండ్ మొట్టమొదటి స్వలింగ సంపర్కుడైన ప్రధాని కూడా వరద్కరే. అతని తల్లి ఐరిష్ కాగా.. తండ్రి భారతీయుడు.