వాషింగ్ట : టెలికం సంస్థలు బ్రాడ్‌బాండ్ టెలికం, బ్రిడ్జ్వాయిస్ల సీఈఓ బంకిమ్ బ్రహ్మ్‌భట్ భారీ మోసానికి పాల్పడినట్లు ఆరోపిస్తూ ఓ దావా ఆగస్టులో దాఖలైనట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం తెలిపింది. ఈ దావా ప్రకారం, అంతర్జాతీయ పెట్టుబడుల సంస్థ బ్లాక్‌రాక్‌కు చెందిన ప్రైవేట్ క్రెడిట్ ఇన్వెస్టింగ్ ఫర్మ్ హెచ్‌పీఎస్ ఇన్వెస్ట్మెంట్ పార్టనర్స్, మరికొన్ని సంస్థలు దాదాపు రూ.4,440 కోట్ల మేరకు ఆయనకు రుణాలిచ్చి, మోసపోయాయి.
పెద్ద ఎత్తున రుణాలు తీసుకోవడం కోసం బ్రహ్మ్‌భట్ ఇన్వాయిస్లను తారుమారు చేశారు. కాగితాలపై భారీ ఆస్తులను చూపుతూ, పెద్ద ఎత్తున సొమ్మును భారత్‌కు, మారిషస్‌కు తరలించారు.