టొరంటో : కెనడాలోని టొరంటోలో భారతీయుడిపై కెనడా జాతీయుడు జాత్యహంకార దాడికి పాల్పడ్డాడు. ఈ వీడియో వైరల్గా మారింది. మెక్డొనాల్డ్స్ ఔట్లెట్లోని మొబైల్ ఆర్డర్ పికప్ కౌంటర్ వద్ద ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది.
కెనడియన్ భారతీయుడిని తోసేసి, అతడి కాలర్ పట్టుకుని ఆగ్రహంతో ఊగిపోయాడు. అతడిపై దాడి చేస్తూ, తిరిగి ఇండియాకు వెళ్లిపోవాలంటూ అరిచాడు.