వాషింగ్టన్, జనవరి 26 : అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ అక్కడి సరిహద్దుల్లో ప్రతి 20 నిమిషాలకు ఓ భారతీయుడు అరెస్ట్ అవుతున్నట్టు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం వెల్లడించింది. రోజుకు 65 మంది భారతీయులు అరెస్ట్ అవుతున్నట్టు తెలిపింది. అయితే 2024తో పోలిస్తే 2025లో ఈ సంఖ్య కాస్త తగ్గినట్టు పేర్కొన్నది. 2024లో 85,119 మందిని అరెస్ట్ చేయగా, 2025లో 23,830 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపింది.
అక్రమ వలసలకు భారత్ ప్రధాన దేశంగా నిలుస్తున్నదని ఈ నివేదిక ఆరోపించింది. అడ్డుకున్న భారతీయుల్లో అత్యధికులు ఉద్యోగం, మెరుగైన వేతనాల కోసం వచ్చిన వాళ్లే ఉన్నారని, కఠినమైన విధానాలు అక్రమ చొరబాట్లను గణనీయంగా తగ్గించగలిగినట్టు పేర్కొన్నది. దీంతో చొరబాటుదారులు అత్యంత ప్రమాదకరమైన మార్గాల్ని ఎంచుకుంటున్నారని నివేదిక తెలిపింది.