ఉక్రెయిన్లో ఇరుక్కుపోయిన భారతీయ విద్యార్థులను వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. 219 మందితో రొమేనియా నుంచి భారత విమానం తిరుగుప్రయాణమైంది. మరో విమానాన్ని కూడా అధికారులు పంపనున్నారు. ఉక్రెయిన్లోని భారతీయులు క్షేమంగా తీసుకొస్తామని, ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదని ప్రభుత్వం తేల్చి చెబుతోంది. అయితే అక్కడి ఎంబసీ అధికారులు మాత్రం భారతీయులు మాత్రం అత్యంత అప్రమత్తతతో ఉండాలని సూచించింది. తమ సూచనలు తీసుకోకుండా, వాటికి విరుద్ధంగా ఎవరూ ఏ దేశ సరిహద్దుల వైపు వెళ్లొద్దన స్పష్టం చేశారు. అక్కడి ఎంబసీ అధికారుల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
ఉక్రెయిన్పై రష్యా దాడులు మరింత పెరుగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్లోని భారత ఎంబసీ తాజాగా ఈ సూచనలు చేసింది. ముఖ్యంగా తూర్పు ఉక్రెయిన్లో ఉంటున్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని, వారి వారి స్థానాల్లోనే ఉండిపోవాలని, లేదంటే… షెల్టర్లలో తలదాచుకోవాలని సూచించింది. ఉక్రెయిన్లోని భారతీయులందరూ తగిన సలహాలు, సూచనలు లేకుండా సరిహద్దులు దాటొద్దు. భారత ఎంబసీ అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూనే వుంటారు. ఎమర్జెన్సీ నెంబర్లను కూడా ఇప్పటికే ప్రకటించాం. జాగ్రత్తగా ఉండండి అంటూ ఉక్రెయిన్లోని భారత ఎంబసీ సూచించింది.