Indian Dies | అబూధాబీలో క్షిపణి శకలం తగిలి భారతీయుడు మృతి..!
Indian Dies : పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతకు అమాయకులు బలవుతూనే ఉన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అబూధాబీలో క్షిపణి శకలాలు(Missile Debris) మీద పడడంతో ఇద్దరు మృతి చెందారు.
Indian Dies : పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతకు అమాయకులు బలవుతూనే ఉన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అబూధాబీలో క్షిపణి శకలాలు(Missile Debris) మీద పడడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో మరణించిన వారిలో ఒకరు భారతదేశ పౌరుడుగా మరొకరిని పాకిస్థాన్ దేశస్థుడిగా గుర్తించారని జోర్డాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
నాలుగు వారాలుగా జరుగుతున్న పశ్చిమాసియా యుద్ధం పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. క్షిపణుల దాడుల కారణంగా గురువారం భారత పౌరుడు సహా పాకిస్థాన్ దేశస్థుడు ప్రాణాలు కోల్పోయారు. అబూధాబీపై ఇరాన్ జరిపిన క్షిపణుల దాడి సమయంలో వాటి శకలాలు తగలడంతో వీరిద్దరూ మృతి చెందారని జోర్డాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రమాదాన్ని జోర్డాన్ తీవ్రంగా ఖండించింది.

‘సోదర దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై ఇరాన్ దాడులను జోర్డాన్ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ దాడి ఫలితంగా భారత్, పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. జోర్డాన్ పౌరుడు ఒకరు గాయపడగా.. ఎమిరేట్స్‌కు చెందిన ఒకరు, మరో భారతీయుడు గాయపడ్డారు. ఇలాంటి క్రూరమైన దాడులను జోర్డాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండిస్తోంది. యూఏఈ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడం, ఆ ప్రాంతంలో సుస్థిరతను నాశనం చేసే చర్యలుగా పరిణగిస్తున్నాం. ఇరాన్ దాడుల నేపథ్యంలో యూఏఈకి మా సానుభూతి తెలియజేస్తున్నాం. క్షిపణి శకలాలు తగిలి మృతి చెందినవారికి సంతాపం తెలియజేస్తున్నాం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం’ అని జోర్డాన్ విదేశాంగ శాఖ ఎక్స్‌లో పేర్కొంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

