వాషింగ్టన్ డీసీ: అమెరికాలోని వాషింగ్టన్ డీసీ మేయర్ అభ్యర్థిగా రినీ సంపత్( Rini Sampath) పోటీ చేయనున్నారు. 31 ఏళ్ల ఆమె.. భారతీయ సంతతి మహిళ. రినీ సంపత్ పేరెంట్స్‌ది తమిళనాడులోని తేని జిల్లా. అయితే డెమోక్రటిక్ అభ్యర్థిగా .. వాషింగ్టన్ డీసీ మేయర్ పదవి కోసం ఆమె పోటీ చేయనున్నారు. ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారామె. వాషింగ్టన్ డీసీ సిటీ మేయర్‌గా పోటీపడుతున్న తొలి దక్షిణాసియా మహిళగా ఆమె నిలుస్తుంది. ఫిక్స్ ద బేసిక్స్ అన్న నినాదంతో ఆమె ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉత్తమ మౌళిక సదుపాయాల కల్పన, ప్రజా వ్యవస్థ మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు ఆమె చెబుతున్నారు.
రినీ సంపత్ .. తేనిలో జన్మించారు. ఏడేళ్ల వయసులో ఆమె ఆమెరికా వెళ్లారు. ప్రస్తుతం ఆమె వయసు 31 ఏళ్లు. ఓ దశాబ్ధ కాలం పాటు ఆమె వాషింగ్టన్ డీసీలో ఉన్నారు. ప్రొఫెషనల్‌గా ఆమె ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు. సైబర్ సెక్యూర్టీ ప్రొఫెషనల్ కూడా. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో ఆమె చదువుకున్నది. 2015లో విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా ఆమె జాతీయ దృష్టిని ఆకర్షించారు. యూఎస్‌సీలో ఉన్న సమయంలో.. విద్యార్థుల హక్కులు, స్వేచ్ఛ గురించి క్యాంపులు ఆర్గనైజ్ చేశారు. వర్ణ వివక్ష, వేధింపులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు.
రాజకీయంగా ఆమె డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2026 వాషింగ్టన్ డీసీ మేయర్ రేసులో ఉన్నారు. 1975 నుంచి ఇప్పటి వరకు వాషింగ్టన్ డీసీలో డెమోక్రాట్లదే ఆధిపత్యం కొనసాగుతోంది.