న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లో సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో అక్కడి భారత రాయబారి, సిబ్బంది, భారత పౌరులను కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి తీసుకొచ్చింది. వాయుసేనకు చెందిన సీ-17 విమానంలో దాదాపు 150 మంది మంగళవారం ఉదయం గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చేరుకున్నారు. మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ నేతృత్వంలోని ప్రభుత్వంతో పోలిస్తే, తాలిబన్ల నీడలో ఆఫ్ఘనిస్తాన్ మెరుగైన స్థితిలో ఉంటుందని రష్యా అభిప్రాయపడింది.