దుబాయ్: ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదల నైతిక, రాజకీయ సమస్య అని, కేవలం వాతావరణపరమైన, భౌతిక స్వభావం గల సమస్య కాదని భారత్ తెలిపింది. వాతావరణం వల్ల కలిగే ప్రభావాలను తట్టుకోగలిగే సత్తాను పటిష్టపరచడం, గ్రీన్హౌస్ గ్యాస్ ఉద్గారాలను తగ్గించడం కోసం కృషిని పెంచాలని పిలుపునిచ్చింది. దీని కోసం సమానత్వం, నైతిక, రాజకీయ న్యాయం ప్రాతిపదిక కావాలని చెప్పింది.
వాతావరణ మార్పులపై పోరాటానికి అభివృద్ధి చెందిన దేశాలు నాయకత్వం వహించాలని తెలిపింది. కాప్28 సదస్సులో శనివారం భారత్ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఈ పిలుపునిచ్చారు. భారత్ 2005-2019 మధ్య కాలంలో ఉద్గారాల తీవ్రతను 33 శాతం తగ్గించిందని చెప్పారు.