లండన్, సెప్టెంబర్ 1: శరీరంలో కొవ్వును కరిగించే ఇన్ైక్లెరిసన్ ఔషధాన్ని నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్హెచ్ఎస్) ద్వారా ప్రజలకు అందించనున్నట్టు యూకే ప్రకటించింది. ఈ ఔషధం పంపిణీకి యూకే.. స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ నోవార్టిస్‌తో ఒప్పందం చేసుకొన్నది. వచ్చే మూడేండ్లలో 3 లక్షల మందికి ఇన్ైక్లెరిసన్ను ఇవ్వనున్నారు. ఊబకాయంతో బాధపడేవారికి ఇన్ైక్లెరిసన్ను ఇంజెక్షన్ రూపంలో ఏడాదికి రెండు సార్లు ఇస్తారు. ఇదొక విప్లవాత్మకమైన చికిత్సా విధానం అని ఎన్హెచ్ఎస్ పేర్కొన్నది.