సిడ్నీ: ఆస్ట్రేలియా(Australia)లోని సిడ్నీలో ఉన్న బాండీ బీచ్లో షూటౌట్ జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. సిడ్నీ శివారు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో.. ఓ కారును సీజ్ చేశారు. దాంట్లో ప్రయాణిస్తున్న ఏడు మందిని అదుపులోకి తీసుకున్నారు. న్యూ సౌత్ వేల్స్ పోలీసులు దీనిపై ప్రకటన జారీ చేశారు. ఓ విధ్వంసకర దాడికి ప్లాన్ జరిగినట్లు తెలుస్తోందన్నారు. అయితే బాండీ బీచ్ టెర్రర్ దాడితో లింకున్నవారిని గుర్తించలేదని పోలీసులు చెప్పారు. ఏడుగుర్ని బంధించిన పోలీసులు వారిని నేలపై కూర్చోబెట్టారు. అనుమానితులను గన్పాయింట్లో అరెస్టు చేశారు. చేతులకు బేడీలు వేశారు. విక్టోరియా ప్లేట్తో వెళ్తున్న తెలుపు రంగు కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొన్నది. బాండీ బీచ్లో జరిగిన కాల్పుల ఘటనలో సుమారు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. సాజిద్ అక్రమ్, అతనికి కుమారుడు నవీద్ ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
🚨 During a heavily-armed police operation, Australian officers have arrested seven men in Liverpool, near Sydney.
They are believed to have been on their way to Bondi Beach and are suspected to have planned another terror attack. #bondiattack pic.twitter.com/hNrZA2xDC6— Mélanie Lacide 🎗 מזל (@MelanieLacide) December 18, 2025