మంగళవారం 26 మే 2020
International - Apr 20, 2020 , 18:50:25

జూమ్‌ ఆప్‌లో వివాహం!

జూమ్‌ ఆప్‌లో వివాహం!

న్యూయార్క్ :  zoom app.. లాక్‌డౌన్‌లో ఇది బాగా పాపుల‌ర్ అయింది. కొన్నిరోజుల‌కే సాఫ్ట్‌వేర్‌ల డేటా లీక్ అవుతుంద‌ని కొంత‌మంది దానిని వాడ‌డం లేదు. మనదేశంలో కేంద్రం ప్రభుత్వం కూడా బాన్ చేసింది. అయిన‌ప్ప‌టికీ న్యూయార్క్‌లో వివాహం చేసుకునే వారు జూమ్ కాల్స్  ఉప‌యోగించుకోవచ్చని న్యూయార్క్ ప్ర‌భుత్వం చెప్పిందట.

వైర‌స్ కార‌ణంగా సామాజిక దూరం పాటించాల‌నే నెపంతో కొంత‌మంది వివాహం చేసుకోకుండా ఉన్నారు.  వీరిని ఉత్సాహ‌ప‌రిచేందుకు న్యూయార్క్‌ గ‌వ‌ర్న‌ర్ ఆండ్రూ క్యూమో ఈ నిర్ణ‌యానికి వ‌చ్చాడు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పెళ్లి చేసుకోవడానికి అనుమతినిచ్చారు. ఈ స‌మాచారాన్ని ట్విట‌ర్ ద్వారా పంచుకున్నాడు ఆండ్రూ. దీంతో వీడియో కాన్ఫిరెన్స్‌లో అక్క‌డ అమ్మాయి, ఇక్క‌డ అబ్బాయి ఒక‌రినొక‌రిని చూసుకుంటూ సంప్ర‌దాయంగా పెండ్లి చేసుకుంటున్నారు.  లాక్‌డౌన్ వ్య‌వ‌ధిలో స‌మావేశాలు, ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల‌కు ఫ్లాట్‌ఫాంగా జూమ్ ప్రాచుర్యం పొందింది. న్యూయార్క్ రోజువారీ కరోనావైరస్ మరణాల సంఖ్య రెండు వారాల్లో కనిష్టానికి చేరుకుంది. 


logo