మాడ్రిడ్ : ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు కొనసాగుతూ వేలాది మంది మృత్యువాతన పడుతుంటే లక్షలాది ఉక్రెయిన్ పౌరులు స్వదేశాన్ని వీడుతున్నారు. యుద్ధం 27వ రోజుకు చేరినా ఉక్రెయిన్‌పై సైనిక ఆపరేషన్‌ను రష్యా ఉధృతం చేసింది. పెద్దసంఖ్యలో ఉక్రెయినియన్లు ఇతర దేశాల్లో శరణార్ధులుగా తలదాచుకుంటున్నారు. ఎన్నో అవరోధాల నడుమ మాతృభూమిని వీడి శరణార్ధి శిబిరాల్లో ఉక్రెయిన్ పౌరులు ఆశ్రయం పొందుతున్న వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి.
హృదయ విదారక దృశ్యాల నడుమ ఉక్రెయిన్ బాలుడికి స్పెయిన్‌లోని నర్సరీలో అతడి క్లాస్మేట్స్ స్వాగతం పలుకుతున్న వీడియో నెట్టింట పలువురిని ఆకట్టుకుంటోంది. ఈ వీడియో అన్ని సోషల్ మీడియా వేదికల్లో చక్కర్లు కొడుతుండగా యూజర్ల నుంచి భారీ రియాక్షన్స్‌ను రాబడుతోంది. తొలుత ఈ వీడియోను ఆస్ట్రేలియాలో ఉక్రెయిన్ మాజీ రాయబారి అలెగ్జాండర్ షెర్బ ట్విట్టర్లో షేర్ చేయగా 20 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వైరల్ వీడియోలో తన క్లాస్మేట్స్ ఉక్రెయిన్ బాలుడిని ఇది తమ స్వస్ధలంగా ఫీల్ అయ్యేలా చేసేందుకు అతడిని సాదరంగా అక్కున చేర్చుకున్న తీరు అందరి హృదయాలను తాకింది.
A #Ukrainian refugee child comes to a kindergarten in #Spain… #StandWithUkraine #HumanityFirst #BeKind #UkraineUnderAttack #RussiaInvadedUkraine #Terrorussia #PutinIsaWarCriminal #StopPutin #RussianUkrainianWar #нетвойнесУкраиной #россиясмотри #Ukraine️ pic.twitter.com/li1wrjhrNq
— olexander scherba🇺🇦 (@olex_scherba) March 19, 2022
ఉక్రెయినియన్ స్కూల్ చిన్నారి స్పెయిన్‌లోని కిండర్‌గార్టెన్‌కు చేరుకున్నాడని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ జోడించారు. ఈ వీడియోను చూసిన తర్వాత ఓ యూజర్ పెద్దల కంటే పిల్లలే పరిణితితో ధృడంగా మెరుగ్గా వ్యవహరిస్తారని కామెంట్ చేశారు. ఈ ట్వీట్‌ను చూసి తాను కన్నీళ్లు ఆపుకోలేకపోయానని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. ప్రపంచం పురోగమించేందుకు చిన్నారులు పంచిన ప్రేమను చూసి మనం నేర్చుకోవాలని మరో యూజర్ కామెంట్ చేశారు.