న్యూఢిల్లీ : వారం ఆరంభంలో పని ఒత్తిడి, చికాకులను పారదోలేలా సోషల్ మీడియాలో ఓ వీడియో (viral video)పలువురు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. బాబ్ మార్లీ త్రీ లిటిల్ బర్డ్స్ సాంగ్‌ను ఓ చిన్నారి ఆలపించడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. హెనోక్ తెసఫయి ఇన్స్టాగ్రాం ఖాతా ఈ వీడియోను షేర్ చేయగా ఇప్పటివరకూ ఏకంగా కోటి మందికి పైగా వీక్షించారు.
ఈ వైరల్ వీడియోలో లిటిల్ బాయ్ బాబ్ మార్లీ డోంట్ వర్రీ ఎబౌట్ ఏ థింగ్ (త్రీ లిటిల్‌బర్డ్స్) సాంగ్‌ను పాడుతుంటాడు. పాట పాడుతూ చిన్నారి ఒలికించిన హావభావాలు అందరినీ కట్టిపడేశాయి. ఈ క్యూట్ వీడియోను చూసిన వారంతా తమ చికాకులను మరిచిపోయి చిన్నారి పెర్ఫామెన్స్‌కు ఫిదా అవుతారు.
డోంట్ వర్రీ ఎబౌట్ ఏ థింగ్..బాబ్ మార్లీ : త్రీ లిటిల్ బర్డ్ అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. లిటిల్ బాయ్ స్వీట్ వాయిస్‌పై నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు.
Read More :