పాక్ ప్రధాని అన్నంత పనీ చేస్తున్నారు. తాను రాజీనామా చేయనని, చివరి బంతి వరకూ ఆడుతూనే వుంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 31 న ఇమ్రాన్ అవిశ్వాసాన్ని ఎదుర్కోబోతున్నారు. దీంతో తన కుర్చీని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా పంజాబ్ సీఎంని మార్చేశారు. ఇప్పటి వరకూ తన పార్టీకి చెందిన వారే ఈ పదవిలో ఉన్నారు. ఇప్పుడు తాజాగా.. ఈ పదవిని తనకు అత్యంత నమ్మకమైన భాగస్వామ్య పక్షం ఇలాహీ పాకిస్తాన్ ముస్లీమ్ లీగ్ కాయద్కు అప్పగించారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా పర్వేజ్ ఇలాహీ బాధ్యతలు తీసుకోనున్నారు.
ఇలాహీ పాకిస్తాన్ ముస్లీం లీగ్ కాయద్ ఇమ్రాన్‌కు అత్యంత నమ్మకమైన భాగస్వామి. ప్రస్తుతం ఈ పార్టీ దగ్గర ఐదుగురు ఎంపీలున్నారు. ప్రస్తుతం పంజా్ సీఎంగా ఉస్మాన్ బద్జర్ ఉన్నారు. ఈయన సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఘట్టం ముగియడమే ఆలస్యం.. ఇలాహీ పాకిస్తాన్ ముస్లీం లీగ్ కాయద్ ప్రధాని ఇమ్రాన్‌తో భేటీ అయ్యింది. తనకు మద్దతిస్తున్నట్లు ప్రకటించింది.
మరో పార్టీ మద్దతు కోసం కూడా ఇమ్రాన్ ప్రయత్నాలు
ముత్తాహిదా కౌమీ మూవ్మెంట్ పాకిస్తాన్ అనే పార్టీ మద్దతు కోసం కూడా ఇమ్రాన్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే ఓ దఫా ఈ రెండు పక్షాల మధ్య భేటీ జరిగింది. ఇమ్రాన్‌కు మద్దతిచ్చేందుకు ఈ పార్టీ కూడా సుముఖత వ్యక్తం చేసింది. అంతేకాకుండా మంత్రి పదవులు కూడా ఇచ్చేందుకు ఒప్పందం జరిగింది. ప్రస్తుతం ఈ పార్టీకి 9 మంది ఎంపీలున్నారు.