న్యూఢిల్లీ: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వివాదంలో ఇరుక్కున్నారు. ఓ మహిళతో ఇమ్రాన్ జరిపిన శృంగార సంభాషణకు చెందిన ఆడియో క్లిప్ లీకైంది. పాక్ జర్నలిస్టు సయ్యిద్ అలీ హైదర్ ఆ ఆడియోను యూట్యూబ్లో రిలీజ్ చేశాడు. పాక్ ప్రధాని కార్యాలయం నుంచి ఆ ఆడియో లీకైనట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇమ్రాన్ తన పదవి కోల్పోయిన తర్వాత ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆ ఆడియో క్లిప్ వైరల్ అవుతోంది. ఆ ఆడియో క్లిప్లు నకిలీవని, ఫేక్ వీడియోలను ప్రభుత్వం సృష్టిస్తోందని ఇమ్రాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ ఆరోపించింది. మహిళతో జరిపిన సంభాషణలో మాట్లాడింది ఇమ్రాన్ అవునా కాదా అన్న విషయం తేలాల్సి ఉంది.