పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో టీవీ మాధ్యమంగా చర్చించాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకోవడానికి ఈ టీవీ చర్చ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ… ‘భారత ప్రధాని మోదీతో టీవీ మాధ్యమంగా చర్చించాలని అనుకుంటున్నా. ఇలా చేస్తే ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలు పరిష్కారమవుతాయని భావిస్తున్నా. ఇలా చేస్తే ప్రజలకు మేలు కలుగుతుంది’ అంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. అయితే పాక్ ప్రధాని చేసిన ఈ ప్రతిపాదనపై భారత విదేశాంగ శాఖ ఇప్పటి వరకూ స్పందించలేదు.