ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ ఇవాళ తన ట్విట్టర్లో స్పందించారు. ఇమ్రాన్ ఇప్పుడో గత చరిత్ర అని, నయా పాకిస్థాన్ పేరుతో పేర్చిన చెత్తను శుభ్రం చేయాలని, దీని కోసం అందరూ కలిసి పనిచేయాలని ఆమె అన్నారు. పాక్ ప్రధాని ఇమ్రాన్‌పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 2018లో ఇమ్రాన్ అధికారం చేపట్టారు. నయా పాకిస్థాన్‌ను క్రియేట్ చేస్తానన్న నినాదంతో ఆయన ఎన్నికలకు వెళ్లారు. కానీ సాధారణ సమస్యల్ని కూడా ఆయన పరిష్కరించలేకపోయినట్లు విమర్శలు వస్తున్నాయి. నిత్యావసర వస్తువుల ధరల్ని అదుపు చేయలేకపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇమ్రాన్‌కు సామర్థ్యం, తెలివి లేదని రెహమ్ విమర్శించారు. ఇమ్రాన్ చేసిన ప్రసంగాన్ని రెహమ్ తీవ్రంగా విమర్శిస్తూ.. మీరు ప్రధాని కానప్పుడే పాక్ ఉన్నతంగా ఉందన్నారు. రాజీనామా చేసేది లేదని, చివరి బంతి వరకు పోరాడుతానని ఇమ్రాన్ పేర్కొన్న విషయం తెలిసిందే.
Imran is history!! I think we should focus on standing together for cleaning the mess Naya Pakistan has left. https://t.co/2Bp04ZDbqY
— Reham Khan (@RehamKhan1) April 1, 2022