కరోనా నిబంధనలతో.. పిల్లల్లో ఇమ్యూనిటీ బలహీనం!

బ్రిటన్ పరిశోధకుల వెల్లడి
న్యూఢిల్లీ : ‘కరోనా ఆపత్కాలంలో మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం మనకి రక్షణ కల్పించాయి.. కానీ అవి పిల్లల్లో మాత్రం రోగనిరోధక వ్యవస్థను బలహీనపరిచాయి’ అని అంటున్నారు బ్రిటన్ నిపుణులు. గత 15 నెలలుగా పిల్లలు ఇండ్లకే పరిమితమయ్యారు. దీంతో వారు సీజనల్ ఫ్లూ జ్వరాలకు కారకమయ్యే వైరస్ల బారిన పడలేదు. దీని ఫలితంగా వారిలో కరోనా తర్వాత ఎదురయ్యే వ్యాధులతో పోరాడగలిగే రోగ నిరోధక వ్యవస్థ అభివృద్ధి చెందలేదని నిపుణులు తెలిపారు. రెస్పిరేటరీ సిన్షియల్ వైరస్ (ఆర్ఎస్వీ)పైనా వైరాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక్కోసారి ఏడాదిలోపు పిల్లల్లో ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదముందని, ఈ వ్యాధికి టీకా కూడా లేదని వారు పేర్కొంటున్నారు. కరోనాకు ముందు రోజుల్లో దవాఖానాలకు తీసుకొచ్చే పిల్లల్లో ఎక్కువ మంది ఇతర సీజనల్ వ్యాధుల కంటే ఆర్ఎస్వీతో బాధపడే వారే ఉండేవారని గుర్తుచేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

