గాజా స్ట్రిప్: గాజాలో గ్రౌండ్ ఆపరేషన్‌కు పెద్ద ప్లాన్ వేసింది ఇజ్రాయిల్(Israel). ఈ నేపథ్యంలో వార్నింగ్ కూడా జారీ చేసింది. వాడి గాజా ఉత్తర ప్రాంతంలో ఉన్న సుమారు 11 లక్షల మంది 24 గంటల్లోగా దక్షిణ గాజా దిశగా తరలి వెళ్లాలని ఇజ్రాయిల్ తెలిపింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితికి కూడా చేరవేసింది. హమాస్‌ను ఏరిపారేయాలన్న లక్ష్యంతో ఇజ్రాయిల్ భారీ సైనిక చర్యకు దిగింది. దీనిలో భాగంగా గాజా ప్రాంతంలో గ్రౌండ్ ఆపరేషన్ మొదలుపెట్టనున్నది. ఆరు రోజుల పాటు రాకెట్ల వర్షంతో మునిగిపోయిన గాజాలో పట్టు కోసం ఇజ్రాయిల్ పూర్తి స్థాయి ఆపరేషన్‌కు సిద్దమైంది.
వాది గాజాలోని ఉత్తర దిక్కున సుమారు 11 లక్షల మంది పాలస్తీనియన్లు జీవిస్తున్నారు. అయితే అతి తక్కువ సమయంలో ఆ మొత్తంలో జనాన్ని తరలించడం సాధ్యం కాదు అని ఐక్యరాజ్యసమితి పేర్కొన్నది. ఒకవేళ అలాంటి ఆదేశాలు చేస్తే వాటిని రద్దు చేయాలని యూఎన్ అభిప్రాయపడింది.