అమెరికాలో నిండిపోతున్న ఐసీయూ బెడ్స్.. మళ్లీ కరోనా పంజా

మిన్నసొట్టా: అమెరికాలో కోవిడ్ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. అక్కడ ఇంకా ఆ వైరస్ పెను ప్రభావం చూపిస్తూనే ఉంది. దేశవ్యాప్తంగా హాస్పిటళ్లలో ఉన్న ఇంటెన్సివ్ కేర్ బెడ్స్ త్వరత్వరగా నిండిపోతున్నాయి. దీంతో మళ్లీ అమెరికాలో కరోనా భయం పట్టుకున్నది. కోవిడ్ సోకిన, అనుమానిత రోగులు.. ఐసీయూ బెడ్స్ కోసం ఆపసోపాలు పడుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే 15 రాష్ట్రాల్లో ఇప్పుడు ఐసీయూ బెడ్స్‌కు ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు ఆరోగ్య, మానవ సేవల శాఖ తెలిపింది. మిన్నసొట్టా, కొలరాడో, మిచిగన్‌లో 37, 41, 34 శాతం ఐసీయూ బెడ్స్ నిండుకున్నాయి. కరోనా పేషెంట్లతో ఆస్పిటళ్లు ఫుల్‌కావడంతో ఇతర వ్యాధులతో బాధపడేవారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. వాషింగ్టన్ యూనివర్సిటీ హాస్పిటల్లో ఫిజిషియన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రొఫెసర్ అలీ మోకాదా తెలిపారు. వ్యాక్సినేట్ కానివాళ్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు ఆయన చెప్పారు.
అమెరికాలో ఇప్పటికీ రోజూ సగటును వెయ్యి మంది కరోనాతో మరణిస్తున్నారు. గత మూడు నెలల నుంచి ఇదే సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. మరణాల సంఖ్య పెరిగిందంటే.. ఇన్ఫెక్షన్ పెరిగినట్లే అని డాక్టర్లు చెబుతున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా ఉన్న కారణంగా మళ్లీ కేసులు పెరుగుతున్నట్లు అనుమానం వ్యక్తం అవుతోంది. మిచిగన్‌లో 54 శాతం వ్యాక్సినేట్ అయ్యారు. కొలరాడో, మిన్నసొట్టాలో జాతీయ సగటుకు సమానంగా ఉన్నారు. న్యూయార్క్‌తో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పాజిటివ్ రేటు 8 శాతం పెరిగింది. సీడీసీ కోవిడ్ నెట్ సర్వియలెన్స్ రిపోర్ట్ ప్రకారం కూడా వ్యాక్సిన్ వేసుకోని వారే ఎక్కువగా ఆస్పత్రి పాలవుతున్నారు. న్యూజెర్సీలోనూ ఐసీయూ బెడ్స్ లో చేరుతున్నవారి సంఖ్య 24 శాతం పెరిగింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

