రేజావిక్, అక్టోబర్ 25: సమాన వేతనం చెల్లించకుండా మహిళల పట్ల చూపుతున్న వివక్షకు నిరసనగా ఐస్‌ల్యాండ్ దేశంలోని మహిళలు మంగళవారం సమ్మెకు దిగారు. వారికి సంఘీభావంగా సాక్షాత్తు దేశ ప్రధాని కట్రిన్ కూడా సమ్మెలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా తాను మంగళవారం విధులు నిర్వహించ లేదని చెప్పారు.
‘దేశంలో వేతన చెల్లింపు, లింగ వివక్షకు వ్యతిరేకంగా మహిళలు చేస్తున్న సమ్మెకు పూర్తి మద్దతు ఇస్తున్నాను. అందుకే విధులకు వెళ్లకుండా ఇంటివద్దనే ఉన్నాను’ అని ఆమె ప్రకటించారు. ఇంకా పని ప్రదేశాల్లో సమాన వేతనం పొందే విషయంలో లింగ వివక్షను ఎదుర్కొంటున్నామని, 2023లో కూడా ఇది కొనసాగడం వాంఛనీయం కాదన్నారు.