IBM | వాషింగ్టన్, మార్చి 23 : టెక్ దిగ్గజం ‘ఐబీఎం’ ఈ ఏడాది అమెరికాలో పెద్ద ఎత్తున ఉద్యోగాల తొలగింపును చేపడుతున్నట్టు తెలిసింది. 9 వేల మందిని విధుల నుంచి తొలగించబోతున్నట్టు సంస్థకు చెందిన విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. వివిధ విభాగాల్లోని సిబ్బంది సేవలను ఆఫ్షోర్ మార్గంలో పొందేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఇందులో ఎక్కువగా భారత్కు తరలిపోయే అవకాశముందని ‘ద రిజిస్టర్’ (బ్రిటిష్ టెక్నాలజీ న్యూస్ వెబ్సైట్) తాజా నివేదిక తెలిపింది. ఖాళీ అవుతున్న స్థానాల్ని ఆఫ్షోర్గా ఇండియాకు తరలించటం గత కొన్నేండ్లుగా జరుగుతున్నదేనని సంస్థకు చెందిన ఇన్సైడర్స్ చెబుతున్నారు.