రియాక్టర్‌ను తయారు చేసిన శాస్త్రవేత్తలు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: సూర్యరశ్మి, నీళ్లతో హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయగల రియాక్టర్‌ను ఇన్స్టిట్యూట్ ఆఫ్ నానోసైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఇందులో నీళ్ల నుంచి హైడ్రోజన్‌ను వేరుచేసే ప్రక్రియలో కార్బన్ నైట్రైడ్లను ఉత్ప్రేరకాలుగా వినియోగించారు. ఉత్ప్రేరకం కలిపిన నీటిని ట్యాంకులాంటి రియాక్టర్ ఛాంబర్లోకి పంపిస్తారు. ఆ నీటిపై సూర్యరశ్మిని ప్రసరింపజేస్తారు. రియాక్టర్ ద్వారా నీటి నుంచి హైడ్రోజన్‌ను గ్రహిస్తారు. ఈ రియాక్టర్ ఎనిమిది గంటల్లో 6.1 లీటర్ల హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. మిగతా సాంకేతికతతో పోలిస్తే ఈ రియాక్టర్‌తో అత్యంత తక్కువ ఖర్చుతో హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ నేషనల్ హైడ్రోజన్ పాలసీని ప్రకటించడం, 2030కల్లా 450 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకొన్న నేపథ్యంలో ఈ ఆవిష్కరణ ప్రాధాన్యం సంతరించుకొన్నది.