బిలాయ్: టైప్-1 డయాబెటిస్‌కు సంబంధించి సంప్రదాయ ఇన్సులిన్ ఇంజెక్షన్ల స్థానంలో సరికొత్త విధానాన్ని ఐఐటీ బిలాయ్ కెమిస్ట్రీ డిపార్టుమెంట్ పరిశోధకులు ఆవిష్కరించారు. హైడ్రోజిల్ ఆధారిత డ్రగ్ డెలివరీ సిస్టమ్‌ను అభివృద్ధి చేశారు. హైడ్రోజిల్స్ అనేవి బయోకంపాటబుల్ పాలీమర్లు. వీటిలో నీటి శాతం అధికంగా ఉంటుంది. కార్డియాలజీ, ఆంకాలజీ, ఇమ్యునాలజీ, నొప్పుల నివారణ తదితర రంగాల్లో ఇప్పటికే వీటిని వాడుతున్నారు. శరీరంలో గ్లూకోజ్ స్థాయి పెరిగినప్పుడు ఇన్సులిన్ విడుదల చేసే విధంగా హైడ్రోజిల్ను అభివృద్ధి చేశారు. ప్రస్తుత ఇన్సులిన్ విధానం వల్ల రోగులకు హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉందని ప్రొఫెసర్ సుచేతన్ పాల్ తెలిపారు. తాజా విధానం డయాబెటిస్ రోగులకు మేలు చేస్తుందన్నారు.