Syria | డమాస్కస్ : పదవీచ్యుతుడైన సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రాజధాని నగరం డమాస్కస్కు ఉత్తర దిశలో 30 కి.మీ. దూరంలో అల్ కుటేఫా వద్ద ఓ శ్మశాన వాటిక భూమి అడుగున సెల్లార్లో సుమారు 1 లక్ష మృతదేహాలు కనిపించాయి. అంతర్యుద్ధంలో మరణించినవారిని, రాజకీయ ప్రత్యర్థులను ఇక్కడ పడేసేవారని వెల్లడైంది. పదేళ్ల క్రితం సిరియా దళాలు ఈ శ్మశాన వాటికను ఏర్పాటు చేసినట్లు ఉపగ్రహ ఛాయాచిత్రాలనుబట్టి తెలుస్తున్నది. మొదట్లో ఇది లోతుగా ఉండేది కాదని, శవాలను కుక్కలు బయటకు లాగుతూ ఉండేవని, ఆ తర్వాత దీనిని లోతుగా తవ్విందని స్థానికులు చెప్పారు.