టెహరాన్, సెప్టెంబర్ 22: ఇరాన్‌లోని ఓ బొగ్గు గనిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి దక్షిణ ఖోర్సాన్ ప్రావిన్స్‌లోని బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించి, 51మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారని ఆ దేశ ప్రభుత్వ మీడి యా ఆదివారం తెలిపింది. మడాంజూ అనే కంపెనీ ఆధ్వర్యంలోని బొగ్గు గని బీ, సీ బ్లాకుల్లో మీథేన్ వాయువు లీకై, పేలుడు సంభవించిందని, గని లోపల శిథిలాల కింద 24 మంది చిక్కుకుపోయారని తెలిసింది. గనిలో మొత్తం 69మంది కార్మికులు పనిచేస్తున్నారని స్థానిక మీడియా పేర్కొన్నది.