వాషింగ్టన్: అమెరికా స్కూల్లో కొందరు విద్యార్థులు కొట్టుకున్నారు. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించారు. అరిజోనాలోని టక్సన్ హై స్కూల్లో ఈ ఘటన జరిగింది. ఇద్దరు విద్యార్థుల తండ్రి మంగళవారం ఆ స్కూల్‌కు వెళ్లాడు. ఒక కుమారుడ్ని విద్యార్థులు వేధించడాన్ని ఆయన నిలదీశారు. దీంతో ఒక గ్రూప్‌లోని కొందరు తండ్రి ఎదుటే ఆ విద్యార్థిపై దాడి చేశారు. ఆ విద్యార్థి సోదరుడు వారిని ఎదుర్కొన్నాడు. ఇది చూసి తండ్రి కూడా విద్యార్థులతో తలపడ్డాడు. ఈ నేపథ్యంలో ఆ గ్రూప్‌లోని విద్యార్థులు ఆయనను చుట్టుముట్టి పిడిగుద్దులు కురిపించారు. మరో గ్రూప్ విద్యార్థులు జోక్యం చేసుకోవడంతో అక్కడ పెద్ద ఘర్షణ వాతావరణం తలెత్తింది. సుమారు 30 మంది విద్యార్థులు ఒకరిపై మరొకరు పంచులిచ్చుకున్నారు.
కాగా, స్కూల్ యాజమాన్యం వెంటనే స్పందించి పోలీసులను రప్పించింది. అక్కడకు వచ్చిన పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. ఈ ఘర్షణకు సంబంధించి విద్యార్థి తండ్రితోపాటు మరొకరిని అరెస్ట్ చేశారు. అనంతరం వారిని విడుదల చేశారు. అయితే విద్యార్థుల కోట్లాట నేపథ్యంలో ఆ స్కూల్లో లాక్డౌన్ విధించారు. మరోవైపు ఘర్షణ సమయంలో కొందరు తమ మొబైల్ ఫోన్లో రికార్డు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
@whatsuptucson Video from inside Tucson High School shows a parent involved in an altercation with multiple students. pic.twitter.com/97WZ9kbpZ6
— Piercen Sturdavant (@Pasty_P_) May 3, 2022