వాషింగ్టన్, జూన్ 14: ‘నీ భర్తను ఎలా చంపాలి’ (హౌ టూ మర్డర్ యువర్ హస్బెండ్) అంటూ గతంలో ఓ బ్లాగు రాసిన అమెరికా రచయిత్రి నాన్సీ క్రాంప్టన్ బ్రోఫీ.. తన భర్తను తుపాకీతో కాల్చిచంపింది. దీంతో ఓరెగాన్ జడ్జి ఆమెకు జీవిత ఖైదు విధించారు. కేసు వివరాల్లోకి వెళితే.. నాన్సీ క్రాంప్టన్ బ్రోఫీ, డేనియల్ బ్రోఫీ దంపతులకు విపరీతమైన అప్పులు ఉన్నాయి. దీంతో భర్తను చంపితే ఆయన పేరున ఉన్న 1.5 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.11 కోట్లు) బీమా సొమ్ము వస్తుందని ఆమె ఆశపడింది. 2018 జూన్లో భర్త ఉద్యోగానికి వెళ్లగా ఆయన వెనకాలే ఓ వాహనంలో ఈమె కూడా వెళ్లింది. పని ప్రదేశంలో భర్త నీటి సింక్ వద్ద ఉండగా నాన్సీ వెనుక నుంచి కాల్చింది. ఆయన కుప్పకూలగా దగ్గరికి వెళ్లి మళ్లీ కాల్చింది. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం నాన్సీకి జీవిత ఖైదు విధించింది.