కీవ్: ఉక్రెయిన్‌పై దాడికి వెళ్లిన రష్యా భారీగానే ఆయుధాల్ని కోల్పోయింది. ప్రతిదాడిలో కొన్ని ధ్వంసం కాగా.. కొన్ని ఆయుధాలు నిర్వీర్యం అయ్యాయి. ఇప్పటి వరకు జరిగిన వార్‌లో రష్యా కోల్పోయిన వాటిల్లో ఇన్ఫాంట్రీ ఫైటింగ్ వెహికిల్స్ 692, యుద్ధ ట్యాంక్‌లు 635, ఆర్మర్డ్ ఫైటింగ్ వెహికిల్స్ 342, సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిల్లరీ 165, ఆర్మర్డ్ పర్సనల్ క్యారియర్స్ 108, డ్రోన్లు 54, హెలికాప్టర్లు 41, ఎయిర్‌క్రాఫ్ట్ 26, నావల్ షిప్స్ 9 ఉన్నాయి.
వివిధ దేశాలకు చెందిన మిలిటరీ నిపుణులు ఈ సమాచారన్ని ద్రువీకరించారు. రష్యా కోల్పోయిన వాహనాలపై ఆర్క్సీ గ్రూపు ఓ రిపోర్ట్ ఇచ్చింది. సుమారు 3500 సైనిక వాహనాలను రష్యా కోల్పోయినట్లు ఆ రిపోర్ట్‌లో చెప్పారు. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి జరిగిన యుద్ధంలో ఆ నష్టం నమోదు అయ్యింది. వీటిల్లో కొన్ని పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కొన్ని పాక్షికంగా. కొన్నింటిని వదిలివెళ్లారు. కొన్నింటిని ఉక్రేనియన్లు స్వాధీనం చేసుకున్నట్లు రిపోర్ట్‌లో తెలిపారు.