ఈ భూమిపై ఎన్ని చీమలు ఉన్నాయో మీకు తెలుసా? ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా? భూమిపై ఎక్కడెక్కడో ఉండే చిన్న చిన్న చీమలను లెక్కించడం అంత సాధ్యమైన పని కాదు కదా! అయితే హాంకాంగ్‌కు చెందిన పరిశోధకులు ఈ భూమిపై ఉన్న చీమల సంఖ్యపై ఓ అంచనాకు వచ్చారు. దాదాపు 20 క్వాడ్రిలియన్ లేదా 20,000,000,00,00,00000 చీమలు ఈ భూమిపై పాకుతున్నాయని అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చీమల సాంద్రతకు సంబంధించిన 489 అధ్యయనాల్లోని సమాచారాన్ని సమ్మిళితం చేసి పరిశోధకులు ఈ సంఖ్యను వెల్లడించారు.
భూమిపై చీమల సంఖ్య – 20,000,00,000,00,00000
భూమిపై మానవ జనాభా – 700 కోట్లు
ఒకరికి 285 కోట్ల చీమలు ఉన్నట్టు అంచనా..
జాతులు, ఉపజాతులు- 15,700
బరువు పరంగా చూస్తే..
చీమలు: 1.2 కోట్ల టన్నులు
మానవులు: 6 కోట్ల టన్నులు
అడవి జంతువులు: 70 లక్షల టన్నులు
పక్షులు: 20 లక్షల టన్నులు