China on Ukraine Conflict |రష్యా మిత్ర దేశం చైనా ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలు ప్రకటించుకున్న స్వాతంత్య్రాన్ని గుర్తిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. దీంతో పశ్చిమ దేశాలు ఘాటుగా రియాక్టయ్యాయి. రష్యాకు వ్యతిరేకంగా అమెరికా, బ్రిటన్ ఆంక్షలు అమల్లోకి తెచ్చాయి. కానీ పుతిన్‌కు అత్యంత మిత్ర దేశమైన చైనా మాత్రం సంయమనం పాటించాలని హితవు చెబుతున్నది. అదే సమయంలో రష్యా తాజా చర్యలపై డ్రాగన్ నోరు మెదపడం లేదు.
ఉక్రెయిన్ సంక్షోభంపై చైనాకు స్థిరమైన వైఖరి ఉందని చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ చెప్పారు. ఏ దేశ భద్రతనైనా తప్పనిసరిగా గౌరవించాల్సిందే. ఐక్యరాజ్యసమితి చార్టర్‌లోని నిబంధనలకు లోబడి వ్యవహరించాల్సిందేనని వ్యాఖ్యానించారు. మింస్క్-2 ఒప్పందాలను సమర్థవంతంగా అమలు చేయడంలో చాలా ఆలస్యంగా జరిగిందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి అన్ని పక్షాలతో చైనా చర్చలు జరుపుతుందని వాంగ్ యీ తెలిపారు. అన్ని పక్షాలు సమస్య పరిష్కారం కోసం సంయమనం పాటించాలని సూచించారు.