జెరూసలేం, జనవరి 16: యెమెన్‌లోని తమ సైనిక స్థావరాలపై అమెరికా, బ్రిటన్ దాడులకు పాల్పడిన నేపథ్యంలో హౌతీ తిరుగుబాటుదారులు ప్రతీకార చర్యకు పాల్పడ్డారు. యెమెన్ తీరంలోని గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో అమెరికాకు చెందిన ఓ కంటెయినర్ నౌకపై సోమవారం క్షిపణితో దాడి చేశారు. దీంతో దాడికి గురైన జిబ్రాల్టర్ ఈగల్ నౌకలో మంటలు రేగినట్టు సమాచారం.