e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home News Adolf Hitler : పోలాండ్‌పై హిట్లర్‌ దాడి.. సుదీర్ఘ యుద్ధానికి అంకురార్పణ

Adolf Hitler : పోలాండ్‌పై హిట్లర్‌ దాడి.. సుదీర్ఘ యుద్ధానికి అంకురార్పణ

తన 15 లక్షల మంది సైనికులతో పోలాండ్‌పై 1939 లో సరిగ్గా ఇదే రోజున హిట్లర్‌ (Adolf Hitler) దాడి చేశాడు. ప్రపంచ చరిత్రలో సుదీర్ఘమైన యుద్ధం ఇక్కడి నుంచే ప్రారంభమైంది. పోలాండ్ సైన్యం జర్మనీని ఎదుర్కొన్నప్పటికీ విజయవంతం కాలేకపోయింది. దాడ మొదలైన నెల రోజుల తర్వాత పోలాండ్‌ను జర్మనీ ఆక్రమించింది.

పోలాండ్‌పై జర్మనీ దాడి చేసిన రెండు రోజుల తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్ కలిసి జర్మనీపై ప్రతీకారం తీర్చుకున్నాయి. ఈ విధంగా క్రమంగా మిగిలిన దేశాలు కూడా ఈ యుద్ధంలోకి దూకడంతో చరిత్రలో సుదీర్ఘకాలం కొనసాగిన యుద్ధంగా మారింది. ఇదే రెండవ ప్రపంచ యుద్ధం రావడానికి తక్షణ కారణం మాత్రమే అని చరిత్రకారులు చెప్తుంటారు. మొదటి ప్రపంచ యుద్ధం ముగియడంతో రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యం సిద్ధమైందని నమ్ముతారు.

- Advertisement -

మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత హిట్లర్, ముస్సోలినీ వంటి నియంతలు ఐరోపాలో అధికారంలోకి వచ్చారు. ఇద్దరూ తీవ్రవాద జాతీయ భావనలను ప్రేరేపిస్తూ అధికారంలోకి వచ్చారు. పారిస్ శాంతి సమావేశంలో ఇటలీ పెద్దగా లాభపడకపోవడంతో వారిలో అసంతృప్తి భావన నెలకొన్నది. 1931 లో జపాన్ చైనాపై దాడి చేసి మంచూరియాను స్వాధీనం చేసుకుంది. 1935 లో ఇథియోపియాపై ఇటలీ, 1938 లో ఆస్ట్రియాపై దాడి చేయడం ద్వారా జర్మనీ తన సామ్రాజ్యవాద విధానాలను ప్రదర్శించాయి. ఈ విధంగా జర్మనీ, ఇటలీ, జపాన్ మూడు ఒక వర్గంగా మారాయి. మరోవైపు, ఫ్రాన్స్, ఇంగ్లండ్, అమెరికా, సోవియట్ యూనియన్ ఒక ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేశాయి. వీటిని మిత్రదేశాలుగా పిలిచేవారు.

క్రమంగా ఈ యుద్ధం పరిధి విస్తరించడంతో.. 60 కి పైగా దేశాలు దానిలో చేరాయి. ఈ యుద్ధం 6 సంవత్సరాలు పాటు కొనసాగింది. ప్రాణ నష్టం ఎంత అని తేలలేదు. కానీ 7 కోట్లకు పైగా ప్రజలు మరణించారని, లక్షల్లో నిరాశ్రయులయ్యారని నమ్ముతారు. జపాన్ మీద అణు దాడి జరిగి అనంతరం ఈ యుద్ధం ముగిసింది. ఇది చరిత్రలో అత్యంత వినాశకరమైన యుద్ధంగా పేర్కొనవచ్చు.

మరికొన్ని ముఖ్య సంఘటనలు..

2019: ట్విట్టర్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే ట్విట్టర్ ఖాతా హ్యాక్

2014: బిహార్‌లో నలంద విశ్వవిద్యాలయం పునఃప్రారంభం

2005: అమెరికా షరతులతో కూడిన విడుదల ప్రతిపాదనను తిరస్కరించిన సద్దాం హుస్సేన్

1997: సాహితీవేత్త మహాశ్వేతా దేవి, పర్యావరణవేత్త ఎంసీ మెహతాకు రామన్ మెగసెసే అవార్డు ప్రదానం

1994: ఉత్తర ఐర్లాండ్‌లో కాల్పుల విరమణను అమలు చేసిన ఐరిష్ రిపబ్లికన్ సైన్యం

1962: మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో శివాజీ విద్యాపీఠం స్థాపన

1933 : ప్రముఖ కవి, రచయిత దుష్యంత్‌ కుమార్‌ జననం

1818 : భారతీయ జీవిత బీమా (ఎల్‌ఐసీ) సంస్థ ఏర్పాటు

ఇవి కూడా చ‌ద‌వండి..

వ్యక్తిని హెలికాప్టర్‌కు కట్టి తిప్పారు‌.. వీడియో వైరల్‌

ఆయుధాలను ధ్వంసం చేసిన అమెరికా.. కారణమేంటంటే..?

భారత్‌లో పెరిగిన ఆర్‌-వ్యాల్యూ.. వేగంగా కొవిడ్‌ వ్యాప్తి

తాలిబాన్‌ దేశాన్ని ప్రపంచం గుర్తించాలి.. లేదంటే మరో 9/11 ఘటన తప్పదు: పాక్‌ ఎన్‌ఎస్‌ఏ

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement