లాహోర్, అక్టోబర్ 21: పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో గల ఒక హిందూ దేవాలయం పునర్నిర్మాణానికి ప్రభుత్వం రూ.30.34 లక్షల బడ్జెట్ కేటాయించింది. ఆలయం నిర్వహణ ఆగిపోయిన 64 ఏండ్ల తర్వాత తాజాగా మొదటి దశ పనుల కోసం ఈ మొత్తాన్ని కేటాయించినట్టు డాన్ పత్రిక పేర్కొంది. పాక్‌లో మైనారిటీల ప్రార్థనా స్థలాలను పర్యవేక్షించే నిర్వాసితుల ట్రస్ట్ ఆస్తి బోర్డ్(ఈటీపీబీ) ఈ నిధులతో నరోవాల్ జిల్లా జఫర్వాల్ పట్టణంలోని బయోలి సాహిబ్ దేవాలయ పనులను ప్రారంభించింది. ప్రస్తుతం నరోవాల్ జిల్లాలో ఒక్క హిందూ దేవాలయమూ లేదు. గత 20 ఏండ్లుగా పాక్ ధర్మస్థాన్ కమిటీ బయోలీ సాహిబ్ ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నది.