Hindenburg Research: త్వరలో మరో బాంబు పేల్చనున్న హిండెన్‌బర్గ్
Hindenburg Research: మరో బాంబు పేల్చనున్నట్లు చెప్పింది హిండెన్‌బర్గ్ రీసర్చ్ సంస్థ. అదానీపై ఇచ్చిన రిపోర్టుతో సంచలనంగా మారిన ఆ సంస్థ మళ్లీ ఎటువంటి అప్డేట్ ఇస్తుందా అని ఫైనాన్షియల్ ఇండస్ట్రీ ఎదురుచూస్తోంది.
న్యూయార్క్: హిండెన్‌బర్గ్ రీసర్చ్(Hindenburg Research) సంస్థ త్వరలో కొత్త రిపోర్ట్‌ను రిలీజ్ చేయనున్నది. ఈ విషయాన్ని ఆ సంస్థ తన ట్విట్టర్లో తెలిపింది. ఇటీవల అదానీ స్టాక్స్(Adani stocks) అంశంపై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ వల్లే.. ఆ కంపెనీ షేర్లు పతనమైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు హిండెన్‌బర్గ్ ఎవర్ని టార్గెట్ చేసిందన్న కోణంలో పుకార్లు సాగుతున్నాయి. ఓ అతిపెద్ద విషయాన్ని బహిర్గతం చేయనున్నట్లు హిండెన్‌బర్గ్ తన ట్వీట్లో వెల్లడించింది.
New report soon—another big one.
— Hindenburg Research (@HindenburgRes) March 22, 2023
జనవరి 24వ తేదీన అదానీ గ్రూపుపై హిండెన్‌బర్గ్ సంస్థ 106 పేజీల రిపోర్టును రిలీజ్ చేసింది. అదానీ సంస్థ ఆర్థిక అక్రమాలకు(financial irregularities) పాల్పడినట్లు ఆ నివేదికలో ఆరోపించింది. ఆ రిపోర్టు వల్ల అదానీ కంపెనీ ట్రేడింగ్‌లో సుమారు 86 బిలియన్ల డాలర్లు నష్టపోయింది.
త్వరలో రిలీజ్ చేయబోయే రిపోర్టులో ఎవరి గురించి ఉంటుందన్న విషయాన్ని ఆ సంస్థ చెప్పలేదు. కానీ ఇటీవల అమెరికాలో జరిగిన బ్యాంకుల మూసివేత(banks closure) గురించి కొత్త రిపోర్టు ఉంటుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

