Dubai Heat wave : దుబాయ్‌ని అత్యధిక ఉష్ణోగ్రతలు హడలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం తేమ, వేడి అధికంగా ఉంది. ఇది ప్రజలకు అత్యంత ప్రమాదకరమని శాస్త్రవేత్తలు వార్నింగ్ ఇస్తున్నారు. జూలై 17న ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెలియస్‌కు చేరుకోగా.. రెండు రోజుల్లోనే అమాంతం పెరిగిపోయాయి. ఇవాళ ఉష్ణోగ్రతలు ఏకంగా 62 డిగ్రీ సెలియస్‌కు చేరాయి. ఇది అత్యంత ప్రమాదకరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ప్రస్తుతం దుబాయ్‌లో ఉష్ణోగ్రత మానవదేహం తట్టుకునే స్థాయిని దాటిపోయిందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిక తేమ, అధిక ఉష్ణోగ్రత కారణంగా మానవ మనుగడ ప్రమాదకర స్థాయికి చేరుతుందని అంటున్నారు. వెట్-బల్బ్ ఉష్ణోగ్రతలుగా పిలువబడే ఈ వాతావరణం శరీరంపై 6 గంటలకు మించి 35 డిగ్రీల కంటే ఎక్కువగా ఉండకూడదని, ఉంటే అది ప్రాణాంతకంగా మారుతుందని తెలిపింది.
తాజా హీట్‌వేవ్ పరిస్థితుల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అవుట్ డోర్ పనులు మానుకోవాలని సూచించింది. వేడి సంబంధ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది. ఇక హీట్‌వేవ్‌ను తట్టుకునేందుకు ప్రజలు ఏసీలను అధికంగా ఉపయోగిస్తున్నారు. దాంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. ఈ హీట్‌వేవ్ పరిస్థితులు అక్టోబర్ వరకు కొనసాగనున్నాయి.