Hermes | యజమాని గొప్ప మనసు.. పనివాడికి 97వేల కోట్ల ఆస్తి
Hermes | స్విట్జర్లాండ్‌లో ఓ తోటమాలి దశ తిరిగింది. నిన్నమొన్నటి దాకా పనిచేసిన ఇంటికే.. ఇప్పుడు వారసుడు కాబోతున్నాడు. భార్యాపిల్లలు లేకుండా వృద్ధాప్యంలో ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్న యజమాని బాగోగులు చూసుకున్నందుకు కోట్ల ఆస్తి సొంతం కాబోతున్నది. తనను కంటికి రెప్పలా చూసుకున్నందుకు తన 97వేల కోట్ల ఆస్తిని అతనికి రాసిచ్చేందుకు ఆ యజమాని ఫిక్సయ్యాడు. ఈ వార్త ఇప్పుడు స్విస్ మీడియాలో వైరల్‌గా మారింది.
Hermes | స్విట్జర్లాండ్‌లో ఓ తోటమాలి దశ తిరిగింది. నిన్నమొన్నటి దాకా పనిచేసిన ఇంటికే.. ఇప్పుడు వారసుడు కాబోతున్నాడు. భార్యాపిల్లలు లేకుండా వృద్ధాప్యంలో ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్న యజమాని బాగోగులు చూసుకున్నందుకు కోట్ల ఆస్తి సొంతం కాబోతున్నది. తనను కంటికి రెప్పలా చూసుకున్నందుకు తన 97వేల కోట్ల ఆస్తిని అతనికి రాసిచ్చేందుకు ఆ యజమాని ఫిక్సయ్యాడు. ఈ వార్త ఇప్పుడు స్విస్ మీడియాలో వైరల్‌గా మారింది.
నికోలస్ ప్యూచ్.. స్విట్జర్లాండ్‌లోని ప్రముఖ లగ్జరీ ఫ్యాషన్ ఉత్పత్తుల కంపెనీ హెర్మెస్ను స్థాపించిన థియరీ హెర్మెస్కు మనుమడు. ఐదో తరానికి చెందిన నికోలస్ ప్యూచ్కు హెర్మెస్ కంపెనీలో 5-6 శాతం వాటాలు ఉన్నాయి. వాటి విలువ దాదాపు 11 బిలయన్ డాలర్ల వరకు ఉంటుంది. అదే మన కరెన్సీలో చెప్పాలంటే 97 వేల కోట్లకు పైనే ఉంటాయి. అంత డబ్బు ఉంటే ఏం లాభం.. నికోలస్ పెండ్లి చేసుకోలేదు. వారసులు ఎవరూ లేరు. దీంతో నికోలస్ తదననంతరం అన్ని వేల కోట్ల ఆస్తి ఎవరికి వెళ్తుందని స్థానికంగా ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో తన దగ్గర పనిచేసే ఓ తోటమాలికి నికోలస్ ఆస్తి మొత్తం రాసివ్వబోతున్నాడని స్విస్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి.
వారసులు లేక ఒంటరిగా ఉంటున్న నికోలస్‌కు కొన్నేండ్లుగా ఓ తోటమాలి చేదోడు వాదోడుగా నిలిచాడు. వృద్ధాప్యంతో ఆయన్ను సొంత కొడుకులా సంరక్షించాడు. దీంతో తన ఆస్తి మొత్తాన్ని సదరు తోటమాలికే రాసివ్వాలని నికోలస్ నిర్ణయించుకున్నాడట. ఇందుకోసమే అతన్ని దత్తత కూడా తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట. ఈ ప్రక్రియలో అవరోధాలు తలెత్తకుండా ఉండేందుకు న్యాయపరమైన సలహాలు కూడా తీసుకుంటున్నాడట. ఇదే విషయాన్ని స్విస్ మీడియా వెల్లడించింది. అయితే అతని పేరును మాత్రం బయటపెట్టలేదు. కాకపోతే అతనికి స్పానిష్ మహిళతో వివాహమైందని.. ఇద్దరు పిల్లలు ఉన్నారని బయట ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ఆ పనివాడికి నికోలస్ గతంలోనే రూ.49 కోట్ల ఆస్తిని రాసిచ్చినట్టు సమాచారం. ఇందులో మరకేశ్ (మొరాకో), మాంట్రిక్స్ ( స్విట్జర్లాండ్) వంటి నగరాల్లోని విల్లాలు ఉన్నట్లు తెలుస్తోంది.
తన దగ్గర పనిచేసే వ్యక్తికి నికోలస్ ఆస్తి రాసివ్వడం వెనుక మరో కారణం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. హెర్మెస్ కంపెనీలోని 23 శాతం వాటాను ఎల్వీఎంహెచ్ అనే మరో ఫ్యాషన్ కంపెనీ బలవంతంగా దక్కించుకుంది. ఆ సమయంలో ఆ ప్రక్రియను అడ్డుకునేందుకు హెర్మెస్ కుటుంబసభ్యులు అందరూ ఏకమయ్యారు. కంపెనీలోని తమ వాటాలతో ఒక హోల్డింగ్ కంపెనీని ఏర్పాటుచేశారు. కానీ ఇందులో నికోలస్ భాగం కాలేదు. తన వాటాను తన దగ్గరే ఉంచుకున్నాడు. ఈ నిర్ణయంతో హెర్మెస్ కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. దీంతో హెర్మెస్ సూపర్వైజరీ బోర్డు నుంచి నికోలస్ వైదొలిగారు. అప్పట్నుంచి హెర్మెస్ కుటుంబసభ్యులతో నికోలస్‌కు విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే బయట వ్యక్తిని తన వారసుడిగా చేయాలని నికోలస్ భావిస్తున్నాడు. కానీ స్విట్జర్లాండ్‌లో ఉన్న చట్టాల ప్రకారం అది అంత ఈజీగా సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే మైనర్లను కాకుండా పెద్దవారిని దత్తత తీసుకోవాలంటే చాలా నిబంధనలు ఉన్నాయి. అది కాకుండా తమ వారిని కాకుండా వేరే వాళ్లను దత్తత తీసుకుంటే.. కోర్టులో దావా వేయాలని కూడా హెర్మెస్ కుటుంబసభ్యులు భావిస్తున్నట్లు సమాచారం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
King | ‘కింగ్’ ఓవర్సీస్ హక్కులు రూ.175 కోట్లు.. భారతీయ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డు!
మద్యం తాగేందుకు వెళ్లి.. విద్యుదాఘాతంతో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం’ జోరు.. 24 గంటల్లోనే 2.14 లక్షలకు పైగా టికెట్లు అమ్మకం!
One Lakh Crore | నెలకు రూ.10వేల జీతం.. కానీ బ్యాంక్ అకౌంట్లో లక్ష కోట్లు.. చివరకు షాక్!
Rajeev Kanakala | ‘డ్రాగన్’తో ఎన్టీఆర్ అభిమానులు రెండు కాలర్లు ఎగరేయడం ఖాయం.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

