బెర్లిన్: జర్మనీ పార్లమెంట్ నేతలను ఉద్దేశించి ఇవాళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడారు. జర్మనీ అందించిన సాయానికి ఆయన థ్యాంక్స్ తెలిపారు. కానీ చాలా ఆలస్యంగా సాయం అందినట్లు ఆయన చెప్పారు. రష్యాతో వాణిజ్య సంబంధాల విషయంలో జర్మనీ నేతల ఆసక్తిని జెలెన్స్కీ తప్పుపట్టారు. రష్యాతో ప్రచ్ఛన్న యుద్ధం సాగుతుంటే, మీరెలా ఆ దేశంతో బిజినెస్ చేస్తున్నారన్నారు. హోలోకాస్ట్ లాంటి ఘటనలు జరగకుండా నివారించడంలో జర్మనీ విఫలమైనట్లు జెలెన్స్కీ అన్నారు. మిమ్మల్ని మీరు రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రష్యాపై కఠిన ఆంక్షలను అమలు చేయాలని, ఆదాయం కన్నా శాంతి విలువైందన్నారు. యూరోప్‌లో ఓ కొత్త గోడను రష్యా నిర్మిస్తోందని, దాన్ని కూల్చివేయాలని జెలెన్స్కీ పిలుపునిచ్చారు. అదేమీ బెర్లిన్ వాల్ కాదని, సెంట్రల్ యూరోప్‌లో గోడను నిర్మిస్తున్నారని, అది బాంబుల వర్షం కురిపిస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆరోపించారు.