కాలిఫోర్నియా: కాలిఫోర్నియాలోని సాక్రమెంటోలో ఉన్న హైవేపై హెలికాప్టర్(Helicopter Crash) కూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. సాక్రమెంటో ఫైర్ డిపార్ట్మెంట్ సహాయక చర్యలు చేపట్టింది. హో ఎవన్యూలో ఉన్న హైవేపై హెలికాప్టర్ కూలింది. ఎయిర్ మెడికల్ సర్వీసులు కల్పించే హెలికాప్టర్ గా గుర్తించారు. అయితే అది ఏరియా ఆస్పత్రి నుంచి ప్రయాణిస్తుందా లేదా అన్న విషయం స్పష్టంగా తెలియదన్నారు. ఏ కారణం వల్ల కూలిందన్న విషయాన్ని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రుల్లో ట్రీట్ చేస్తున్నారు.
OMG! A REACH medical helicopter crashed on eastbound Highway 50 in Sacramento, California, reports of multiple victims. – Fire department pic.twitter.com/z5zIuzVikB
— Tim (@Dragonboy155) October 7, 2025