దుబాయ్: ఈ ఫోటోను చూశారా? ఇది ఇటలీ ప్రధాని(Italy PM) జియార్జియా మెలోని ఫోన్ కవర్. ఇటీవల దుబాయ్‌లో జరిగిన కాప్28 సమావేశం సమయంలో ప్రధాని మోదీతో ఆమె సెల్ఫీ ఫోటో దిగారు. ఆ టైంలో మెలోని ఫోన్ కేస్‌పై ఉన్న కొటేషన్స్ కనిపించాయి. ఆందోళన కలిగినప్పుడు ఆ టెన్షన్ నుంచి తప్పించుకునేందుకు మెలోని తన ఫోన్ కవర్‌పై కొన్ని కోట్స్ రాసుకున్నారు. మెలోని మొబైల్ కవర్‌పై ఉన్న ఆ కొటేషన్లు, కార్టూన్లు ఇలా ఉన్నాయి. మై యాంగ్జైటీ డస్నాట్ డిఫైన్ మీ, ఐయామ్ ఇనాఫ్, ఐయామ్ లవ్డ్, ఇట్స్ ఓకే ఫర్ మీ టు సే నో ఫర్ మై మెంటల్ హెల్త్, ఐ గివ్ మైసెల్ఫ్ పర్మిషన్ టు టేక్ ఎ బ్రేక్ లాంటి కోట్స్ ఆ మొబైల్ కవర్‌పై రాసి ఉంది.
మానసిక ఆరోగ్యం చాలా కీలకమైందని, ఆందోళనకర పరిస్థితిలు తలెత్తినప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి ఆ కవర్‌పై ఉన్న టిప్స్ సూచిస్తాయన్న విషయం తెలుస్తోంది. అయితే ప్రధాని జార్జియా మెలోని ఫోన్‌పై ఉన్న ఆ కవర్‌ను.. ఆమె ఏడేళ్ల కూతురు అటాచ్ చేసినట్లు బ్రిటన్ పత్రిక ఓ కథనాన్ని రాసింది. వైరల్ అవుతున్న ఆ ఫోన్ కవర్‌ను ఇండియాలో వెయ్యి రూపాయిలకు ఆన్లైన్లో అమ్ముతున్నట్లు ఓ వెబ్సైట్ పేర్కొన్నది.
Giorgia Meloni’s phone case 👀(thx @CrazySammaPol) https://t.co/mH0qcRWR1j pic.twitter.com/eZQHocPi6f
— Crazy Ass Moments in Italian Politics 🇮🇹 (@CrazyItalianPol) December 2, 2023