సాధారణంగా పాముకు పొలుసులు ఉంటాయి కానీ.. బొచ్చు ఎక్కడైనా ఉంటుందా? అందులోనూ పాములు గ్రీన్ కలర్లో ఉంటాయా అసలు.. ఒక్క చెట్ల మీద ఉండే పాములు తప్పితే.. మిగితా పాములేవీ గ్రీన్ కలర్లో ఉండవు.
కానీ.. ఈ పామును చూస్తే మాత్రం మీ మతి పోతుంది. అసలు ఇది నిజంగా పామేనా.. అన్నట్టుగా ఉంటుంది. చూడటానికి ఏలియన్లా ఉన్న ఈ పాము థాయిలాండ్‌లోని సాఖన్ నాఖన్ అనే ప్రాంతంలో కనిపించింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. వామ్మో.. ఇదేం పామురా బాబోయ్.. జిందగీలో ఇటువంటి పామును చూడలే.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.