POK- UK High Commissioner | పీవోకేలో పాక్ బ్రిటన్ హైకమిషనర్ టూర్.. తీవ్రంగా స్పందించిన భారత్..!
POK- UK High Commissioner | పాక్ ఆక్రమిత కశ్మీర్’లో పాకిస్థాన్ బ్రిటీష్ హైకమిసనర్ పర్యటనపై భారత్ భగ్గుమన్నది. ఇది తమ ప్రాదేశిక స్వావలంభనను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది.
POK- UK High Commissioner | `పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)`లో ఇస్లామాబాద్ బ్రిటన్ హైకమిషనర్ పర్యటనపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. `భారత్ ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించడం ఆమోదయోగ్యం కాదు. ఎల్లవేళలా భారత్‌లో జమ్ముకశ్మీర్ సమగ్ర భాగం` అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నొక్కి చెప్పింది. పీఓకేలో పాక్‌లో బ్రిటన్ హైకమిషనర్ జాన్ మారియట్ పర్యటనపై శుక్రవారం స్పందించింది. `ఇస్లామాబాద్‌లో బ్రిటన్ హై కమిషనర్ జాన్ మారియట్ పీవోకేలో పర్యటించడం అత్యంత అభ్యంతరకరం. దీన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తుంది. బ్రిటన్ విదేశాంగశాఖ అధికారితో కలిసి పీవోకేలో ఈ నెల 10న పర్యటించారు. భారత సార్వభౌమత్వం, ప్రాదేశికత సమగ్రతను ఉల్లంఘించడం ఎంత మాత్రమూ సమంజసం కాదు` అని పేర్కొన్నారు.
దీనిపై భారత్‌ల బ్రిటన్ హై కమిషనర్‌ను పిలిపించి విదేశాంగశాఖ కార్యదర్శి తీవ్ర నిరసన తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్ము అండ్ కశ్మీర్, లడఖ్ ఎల్లవేళలా భారత్‌లో అంతర్భాగమే` అని విదేశాంగశాఖ తెలిపారు.
పాకిస్థాన్‌లో బ్రిటన్ హై కమిషనర్ జాన్ మారియట్ ఈ నెల 10న పీవోకేలో కేంద్ర స్థానమైన మిర్‌పూర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు, వీడియోలను `ఎక్స్`లో పోస్ట్ చేశారు. `బ్రిటన్, పాకిస్థాన్ పౌరుల మధ్య సంబంధాలకు గుండెకాయ మిర్పూర్‌కు సలాం. 70 శాతం బ్రిటన్ పాకిస్థానీయుల మూలాలూ మిర్పూర్ నుంచే వచ్చాయి. ప్రవాసుల ప్రయోజనాల కోసం మమ్ముల్ని కలిసి పని చేసేలా చేస్తోంది. మీ ఆతిథ్యానికి ధన్యవాదాలు` అంటూ పోస్ట్ పెట్టారు. జాన్ మారియట్ పీఓకే పర్యటనపై పాక్‌లో బ్రిటన్ హైకమిషనర్ ట్విట్టర్ హ్యాండిల్..వీడియోను పోస్ట్ చేసింది. మిర్పూర్ పర్యటనలో భాగంగా స్థానికులతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చిన జాన్ మారియట్.. బేకరిలోకి వెళ్లారు. స్థానిక జిల్లా అధికారులతో చర్చించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

