పెళ్లయిన తర్వాత ఉండే బాధ్యతలు వేరు.. పెళ్లి కాకముందు ఉండే బాధ్యతలు వేరు. అందుకే.. పెళ్లి చేసుకుంటే ఎన్నో బాధ్యతలను మోయాల్సి ఉంటుంది. ఆ బాధ్యతలను మోయలేక కొందరు బోర్లాపడిపోతారు. అటువంటి జంటలు ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటాయి. భార్యాభర్తలు ఎప్పుడూ సంతోషంగా ఉండరు. అటువంటి వాళ్లకు ఓ బ్యాడ్ న్యూస్. ఎప్పుడూ కొట్టుకుంటూ ఉండే భార్యాభర్తలు.. ఎప్పుడూ గొడవలు పెట్టుకునే భార్యాభర్తల కన్నా.. సంతోషంగా ఉండే భార్యాభర్తలు ఎక్కువ కాలం జీవిస్తారట.
వాళ్లు భార్యాభర్తలే కావచ్చు.. సహజీవనం చేస్తుండొచ్చు.. ఎలాగైనా సరే.. ఒక జంట ఎక్కువ కాలం జీవించాలంటే.. ఖచ్చితంగా హ్యాపీగా ఉండాల్సిందేనని సర్వేలు చెబుతున్నాయి. అమెరికాకు చెందిన పర్సనాలిటీ, సోషల్ సైకాలజీ జర్నల్లో ఈ విషయాలను స్పష్టం చేశారు.
దానికి కారణం కూడా రీసెర్చర్లు చెప్పుకొచ్చారు. ఎప్పుడూ సంతోషంగా ఉండే జంటల మధ్య చాలా తక్కువ ఆరోగ్య సమస్యలు ఉంటాయట. దాని వల్ల వాళ్లు ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తారట. అదే.. ఎప్పుడూ గొడవపడే జంటల మధ్య గొడవలతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయట. వాళ్లకు సంతోషం కూడా కరువయి.. మానసిక సమస్యలు ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంటుందని.. దాని వల్ల వాళ్ల లైఫ్ టైమ్ తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.